ఒకవైపు తీవ్రమైన ఎండలు..మరోవైపు భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటికి యమ డిమాండ్ ఏర్పడింది. ప్రధానంగా వెస్ట్‌జోన్‌లో వాటర్ ట్యాంకర్లకు విపరీతమైన రద్దీ ఏర్పడింది.
మీకు వాటర్ బోర్డు ట్యాంకర్ కావాలా? ఐతే ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే రెండు రోజుల నిరీక్షణ తప్పదు ..ఎందుకంటారా వాటర్ ట్యాంకర్ కోసం రోజుకు దాదాపు వందలాది మంది వెయింటింగ్ లిస్ట్‌లో ఉంటున్నారు.
జలమండలి పరిధిలో ఉన్న పలు ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను శుక్రవారం ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్‌లో పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన