నీటి ట్యాంకర్ల సరఫరాలో ఆలస్యం వద్దు
జలమండలి పరిధిలో ఉన్న పలు ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను శుక్రవారం ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్‌లో పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన ఆయన.. ముందు వెంకటగిరి ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లి ట్యాంకర్ బుకింగ్, డెలివరీ తదితర వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
- డిమాండ్‌ను బట్టి రెండు షిఫ్టుల్లో సిబ్బందిని సమకూర్చుకోవాలి
- ఆకస్మిక తనిఖీల్లో జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి
సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ) : జలమండలి పరిధిలో ఉన్న పలు ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్లను శుక్రవారం ఎండీ సుదర్శన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జూబ్లీహిల్స్ వెంకటగిరి, కొండాపూర్, మాదాపూర్‌లో పలు ఫిల్లింగ్ స్టేషన్లను తనిఖీ చేసిన ఆయన.. ముందు వెంకటగిరి ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళ్లి ట్యాంకర్ బుకింగ్, డెలివరీ తదితర వివరాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుకింగ్ టైమింగ్స్, ఏ సమయానికి డెలివరీ ప్రారంభిస్తున్నారు? అనే విషయాలను తెలుసుకున్నారు. ట్యాంకర్ డెలివరీకి సంబంధించిన ఇన్ అండ్ ఔట్ లాగ్‌బుక్స్‌ను పరిశీలించారు.
లాగ్‌బుక్స్ సక్రమంగా నిర్వహించాలని, అందులో టైమింగ్స్ తప్పనిసరిగా నమోదు చేయాలని చెప్పారు. ట్యాంకర్ డెలివరీలో ఆలస్యం లేకుండా చూడాలన్నారు. బుక్ చేసిన వెంటనే ట్యాంకర్ డెలివరీ చేయడానికి ప్రయత్నించాలన్నారు. పెండెన్సీని తగ్గించుకోవడానికి.. స్థానిక అధికారులు వాళ్ల పరిధిలో ప్లాన్ చేసుకోవాలని వివరించారు. బుకింగ్ ఎకువ వస్తూ.. డెలివరీలు పెండింగ్‌లో ఉన్న కేంద్రాల్లో రెండు షిఫ్టుల్లో పని చేసేందుకు తగిన సిబ్బందిని సమకూర్చుకోవాలని సూచించారు. డిమాండ్‌ను బట్టి.. డెలివరీ టైమింగ్స్‌ను కూడా పెంచుకోవాలని వివరించారు. ట్యాంకర్లలో నింపుతున్న నీటి నమూనాలు తీసుకుని పరీక్షించారు. ఫలితాలపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు.
పంపు రూమ్‌లను, క్లోరినేషన్ రూమ్‌లను కూడా పరిశీలించారు. అలాగే ట్యాంకర్ డ్రైవర్లతో ఎండీ సుదర్శన్ మాట్లాడారు. ట్యాంకర్ డెలివరీల్లో ఏవైనా ఇబ్బందులున్నాయా? అని ఆరా తీశారు. ట్రాఫిక్ జామ్ సమయాల్లో ట్యాంకర్ డెలివరీ ఆలస్యమవుతుందని ఎండీ గుర్తించారు. ట్యాంకర్ ఇన్చార్జులతో మాట్లాడి ఈ పాస్ మిషన్, స్మార్ట్ కార్డుల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఫిల్లింగ్ స్టేషన్లలోని సీసీ కెమెరాలు సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించారు. ఇప్పటికే అన్ని స్టేషన్ల కెమెరాలు ప్రధాన కార్యాలయానికి అనుసంధానమై ఉన్నాయని.. నిరంతరం వాటి ద్వారా అకడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు పేరొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్‌కుమార్, సీజీఎం విజయరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

