సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నాలుగు రోజులుగా జరిగిన మహిళల ఎలైట్ బాక్సింగ్ టోర్నమెంట్ ఘనంగా ముగిసింది. టోర్నీ ఆఖరి రోజైన మంగళవారం ఫైనల్ పోటీలలో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్ (ఆర్పీఎస్బీ)
తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మరోమారు తళుక్కున మెరిసింది. తన పంచ్ పవర్‌కు తిరుగులేదని నిరూపిస్తూ అపజయమెరుగకుండా అప్రతిహత విజయాలతో జాతీయ చాంపియన్‌గా నిలిచింది.
సప్త సముద్రాలీదిన వాడికి పిల్ల కాలువ ఒక లెక్కా అన్నట్లు కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ చేజిక్కించుకున్న తెలంగాణ స్టార్ నిఖత్ జరీన్.. జాతీయ ఎలైట్ బాక్సింగ్ చాంపియన్