దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,160 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
గ్రాన్యూల్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని రూ.135 కోట్లు ఆర్జించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది అరబిందో ఫార్మా. అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో రూ.571 కోట్ల లాభాన్ని గడించింది.