IOC | న్యూఢిల్లీ, జూలై 30: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) లాభాలకు రిఫైనింగ్, మార్కెట్ మార్జిన్లు గండికొట్టాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలలకాలానికిగాను కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 81 శాతం తగ్గి రూ.2,643.18 కోట్లకు పరిమితమైనట్లు పేర్కొంది.
2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.13,750 కోట్ల లాభాన్ని గడించింది. బ్యారెల్ క్రూడాయిల్‌ను శుద్ది చేయడంతో సంస్థకు 6.39 డాలర్ల ఆదాయం లభించింది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2.15 లక్షల కోట్లు ఆర్జించింది.