హైదరాబాద్, ఆగస్టు 12: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది అరబిందో ఫార్మా. అమ్మకాలు భారీగా పుంజుకోవడంతో రూ.571 కోట్ల లాభాన్ని గడించింది.
క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.520.5 కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో ఆదాయం రూ.6,236 కోట్ల నుంచి రూ.6,850.5 కోట్లకు ఎగబాకినట్లు కంపెనీ వైస్ చైర్మన్, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.