హైదరాబాద్, జూలై 30: గ్రాన్యూల్స్ అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను పన్నులు చెల్లించిన తర్వాత నికర లాభాన్ని రూ.135 కోట్లు ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.48 కోట్ల కంటే ఇది మూడింతలు అధికం.
అటు ఆదాయం కూడా రూ.985 కోట్ల నుంచి రూ.1,180 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కంపెనీ సీఎండీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..గత త్రైమాసికంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకున్నట్లు, ఎదురుదెబ్బలు తగిలిన తర్వాత తిరిగి పుంజుకోగలిగామని చెప్పారు.