న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఆశాజనక పనితీరు కనబరిచింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.10,461 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. 2023-24 ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.9,544 కోట్ల లాభంతో పోలిస్తే 10 శాతం ఎగబాకినట్లు కంపెనీ వెల్లడించింది.
అటు ఆదాయం కూడా రూ.1,88,749 కోట్ల నుంచి రూ.2,10,910 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది. గత త్రైమాసికంలో ఆర్జించిన ఆదాయంలో తొలి ఏడాది ప్రీమియం వసూళ్లు రూ.6,811 కోట్ల నుంచి రూ.7,470 కోట్లకు పెరగగా, రెన్యూవల్ ప్రీమియం వసూళ్లు రూ.53,638 కోట్ల నుంచి రూ.56,429 కోట్లకు, అలాగే పలు సంస్థల్లో పెట్టుబడుల రూపంలో రూ.96,183 కోట్లు సమకూరినట్లు తెలిపింది.