న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశీయ టెలికం దిగ్గజాల్లో ఒకటైన భారతీ ఎయిర్టెల్ లాభాలు వాయువేగంతో దూసుకుపోయాయి. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.4,160 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.
ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.1,612.5 కోట్ల కంటే రెండున్నర రెట్లు అధికం. సమీక్షకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం 2.8 శాతం అధికమై రూ.38,506.4 కోట్లకు చేరుకున్నది.