ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు.. మండిపోతున్న ఇంధన రేట్లు.. దేశ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో నెలవారీ కుటుంబ ఖర్చు రెట్టింపు కంటే ఎక్కవగా పెరిగిపోయింది.
నిత్యావసరాల ధరలు చుక్కలన్నంటడంతో సామాన్యుల బతుకులు ఆగమవుతున్నాయి. దీనికితోడు ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, వైద్య ఖర్చులు తడిసి మోపెడవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.