‘ప్లేట్ భోజనం రూ.32 వేలు?’ శీర్షికన ఈ నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంలో తీగలాగితే డొంకంతా కదులుతున్నది.
ప్లేట్‌మీల్స్ తినాలంటే రూ.80.. ఫుల్‌మీల్స్ అయితే రూ.100 ఖర్చు అవుతుంది. అలాంటిది.. గర్భిణులు, బాలింతలు తినే భోజనానికి రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంతో తెలుసా.. రూ.27.59 మాత్రమే.