హంగులు లేవు. వెండికే సొంతమైన ధగధగల్లేవు. ముత్యాల మెరుపుల్లేవు. రత్నాల రాచ మర్యాదలూ లేవు. అయితేనేం, ఆ నగల వగలు చూడాల్సిందే. ధర తక్కువ. వైవిధ్యం ఎక్కువ. కళాత్మకతా అధికమే.
చిటపట చినుకులు... మిలమిల మెరుపుల మధ్య ముద్దుగా పుడుతుంది ముత్యం. ఆ అందాన్ని ఆభరణంగా మార్చితే అతివ మెడలో అలంకారమవుతుంది. అంతకు మించి అద్భుతం చేస్తే... అనే ఆలోచన నుంచి పుట్టిందే... ఇక్కడ కనిపిస్తున్న ముత్యాల కే