చిన్నదానికి.. సన్నపూస!
నగలెప్పుడూ ధగధగలాడుతూ ఉండాలనుకుంటాం. అందుకే, కుందనపు సొంపునకు రాళ్ల మెరుపు చేరుస్తాం. సోకులన్నీ రాళ్లవేనా.. మేం మాత్రం తక్కువా? అంటున్నాయి సన్నపూసలు. కాబట్టే, అచ్చంగా వాటితోనే బోలెడు కొత్త డిజైన్లు సృష్టిస్తున్నారు ఫ్యాషనిస్టులు.
నగలెప్పుడూ ధగధగలాడుతూ ఉండాలనుకుంటాం. అందుకే, కుందనపు సొంపునకు రాళ్ల మెరుపు చేరుస్తాం. సోకులన్నీ రాళ్లవేనా.. మేం మాత్రం తక్కువా? అంటున్నాయి సన్నపూసలు. కాబట్టే, అచ్చంగా వాటితోనే బోలెడు కొత్త డిజైన్లు సృష్టిస్తున్నారు ఫ్యాషనిస్టులు. తెలుపు, ఆకుపచ్చ, ఎరుపు మాత్రమే కాదు.. బంగారం రంగు పూసలూ వీటితో జోడీ కడుతున్నాయి!

పూసలతో నగలది పాత చుట్టరికమే. చెవి దుద్దు కానీయండి, మెడ గొలుసు కానీయండి, వడ్డాణమైనా వంకీ అయినా సరే… కింద పూస వేలాడుతుంటేనే దానికి ఒంపూసొంపూ తోడవుతాయి. ఫ్యాషన్ సొగసుల్ని సంతరించుకుంటాయి. అందుకే రాళ్లతో సమాన హోదాను పూసలకూ ఇస్తారు డిజైనర్లు. అందులోనూ సన్నటి పూసల గుత్తులు మరింత ప్రత్యేకం. అయితే ఆ పూసలే ప్రధానంగా నగల్ని రూపొందిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ఎవరి మదిలో మెదిలిందో కానీ సన్నసన్నటి పూసలతో అందమైన నగలెన్నో ముస్తాబయ్యాయి. రాళ్ల రాజసానికి తామేమీ తీసికట్టు కాదనేలా తయారయ్యాయి.

ఈ తరహా బంగారు నగల్లో కెంపులు, పచ్చలు, సన్న ముత్యాలు, పసిడి మువ్వలు భాగమవుతున్నాయి. ఫ్యాన్సీ వాటిలో అయితే ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల బీడ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ రకం బీడెడ్ ఆభరణాల్లో చోకర్లు, నెక్లెస్‌లు, హారాలతోపాటు వడ్డాణాలు, జడబిళ్లల్లాంటివి కూడా వస్తున్నాయి. దేవతా ప్రతిమలతో టెంపుల్ జువెలరీ తరహాలో రూపొందుతున్నాయి. పూసల కారణంగా రంగులతో నిండుగా కనిపిస్తాయి కనుక మ్యాచింగ్గానూ పనికొస్తాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Symbols were tampered | ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో గుర్తులు తారుమారు..! నిలిచిన పోలింగ్
Hrithik Roshan | మన బంధం ఒక్క సినిమాతో ముగియలేదు.. దర్శకుడు సంజయ్ గుప్తా మృతిపై హృతిక్ ఎమోషనల్!
Road accident | గద్వాలలో కారు బీభత్సం.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం
SCENE Trailer | ‘సీన్’ ట్రైలర్ వచ్చేసింది.. అంచనాలు పెంచుతున్న సూర్య-నస్లెన్ మైండ్ గేమ్!
Bigg Boss 10 | హౌస్ నుంచి ఫోక్ సింగర్ ఝాన్సీ ఎలిమినేట్.. కన్నీళ్లు పెట్టుకున్న ముకేశ్ !
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

