చిటపట చినుకులు… మిలమిల మెరుపుల మధ్య ముద్దుగా పుడుతుంది ముత్యం. ఆ అందాన్ని ఆభరణంగా మార్చితే అతివ మెడలో అలంకారమవుతుంది. అంతకు మించి అద్భుతం చేస్తే… అనే ఆలోచన నుంచి పుట్టిందే… ఇక్కడ కనిపిస్తున్న ముత్యాల కేప్. సాధారణంగా చీరలూ, డ్రెస్సుల మీద వస్త్రంతో చేసిన కేప్ ధరిస్తారు. అందుకు భిన్నంగా ముత్యాల సరాలతో తయారు చేసింది ప్రెర్టో సంస్థ. మంచి ముత్యాలు, స్వరోవ్స్కీ రాళ్లు, కుందన్లు, రత్నాలతో పాటు 24 క్యారెట్ల బంగారుపూత పూసిన లింకులను వాడి దీన్ని తీర్చిదిద్దారు. సాదా చీరమీదో, సింపుల్ డ్రెస్ మీదో ధరిస్తే కథల్లో రాకుమారి కళ్లముందు ప్రత్యక్షమవుతుంది.