బంగారపు
హంగులు లేవు. వెండికే సొంతమైన ధగధగల్లేవు. ముత్యాల మెరుపుల్లేవు. రత్నాల రాచ మర్యాదలూ లేవు. అయితేనేం, ఆ నగల వగలు చూడాల్సిందే. ధర తక్కువ. వైవిధ్యం ఎక్కువ. కళాత్మకతా అధికమే. ఏ చీర కట్టుకుంటే ఆ వన్నె హారం ధరించవచ్చు. అదే రంగు ఇయర్ రింగ్స్ సింగారించుకోవచ్చు. అంతేనా, ఎకోఫ్రెండ్లీ కూడా. బంకమన్ను, గుడ్డ పేలికలు, పూసలు, దారాలు, సహజమైన రంగులు.. ఇవే ముడి సరుకు. హ్యాండ్ మేడ్ హారాలే కాదు.. జుంకాలు, ముక్కుపుడకలు, గాజులు కూడా లభిస్తాయి.