పాతగుట్ట లక్ష్మీనరసింహుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా చక్రతీర్థస్నానం జరిపించారు. కల్యాణం, రథోత్సవంతో అలసిన స్వామివారికి చక్రతీర్థ సేవ నిర్వహించి శృంగార డోలోత్సవానికి సిద్ధం చేశారు.
యాదగిరి గుట్టలోని పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామి, అమ్మవారి దివ్య విమాన రథోత్సవాన్ని శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు.