ఓ పెద్దాయన కండ్లు రెండు నెలల నుంచి పసుపు రంగులో ఉన్నాయి. దీంతో ఆయన ఆర్ఎంపీ వైద్యుణ్ని సంప్రదించాడు. అతను కామెర్లు అని చెప్పి రెండు నెలల నుంచి అతనికి యాంటి బయాటిక్స్‌తో చికిత్స ప్రారంభించాడు.
చివరి దశలో మాత్రమే గుర్తించగలిగే మహమ్మారి పాంక్రియాటిక్ క్యాన్సర్ (క్లోమగ్రంథి క్యాన్సర్). ఇది సోకిన రోగుల్లో సగంమంది మూడు నెలల్లోనే మరణిస్తున్నారు.