Pancreatic Cancer | పాంక్రియాటిక్ క్యాన్సర్కు చెక్!
చివరి దశలో మాత్రమే గుర్తించగలిగే మహమ్మారి పాంక్రియాటిక్ క్యాన్సర్ (క్లోమగ్రంథి క్యాన్సర్). ఇది సోకిన రోగుల్లో సగంమంది మూడు నెలల్లోనే మరణిస్తున్నారు.
- మహమ్మారిపై పోరాడే డీఎన్ఏలోని కీలక కణాలను గుర్తించిన పరిశోధకులు
Pancreatic Cancer | హైదరాబాద్ (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): చివరి దశలో మాత్రమే గుర్తించగలిగే మహమ్మారి పాంక్రియాటిక్ క్యాన్సర్ (క్లోమగ్రంథి క్యాన్సర్). ఇది సోకిన రోగుల్లో సగంమంది మూడు నెలల్లోనే మరణిస్తున్నారు. అయితే, ఈ క్యాన్సర్పై పోరాడే డీఎన్ఏలోని కీలక జన్యువులను అమెరికా, యూకే పరిశోధకులు గుర్తించారు. ఈ కణాలు నాశనం కాకుండా రివర్స్ థెరపీ ద్వారా చెక్ పెడితే.. పాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులను కట్టడి చేయవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఎలా చేస్తారంటే??
క్లోమంలో ఉన్న డీఎన్ఏలోని హెచ్ఎన్ఎఫ్4ఏ జన్యువుల సాయంతోనే శరీరంలోని కీలక అవయవాలన్నీ జీవక్రియలను సక్రమంగా నెరవేరుస్తాయి. అయితే, పాంక్రియాటిక్ క్యాన్సర్ సోకిన రోగిలో ఈ క్యాన్సర్ కణాలు హెచ్ఎన్ఎఫ్4ఏ జన్యువులపై దాడి చేసి, కొత్త కణాలు పుట్టకుండా నిరోధిస్తున్నట్టు పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఈ ప్రక్రియకు ‘డీఎన్ఏ మిథైలేషన్’గా పేరు పెట్టారు. అయితే, రివర్స్ థెరపీ సాయంతో ఈ ‘డీఎన్ఏ మిథైలేషన్’ ప్రక్రియను ఇన్యాక్టివ్ చేసి, హెచ్ఎన్ఎఫ్4ఏ జన్యువుల వృద్ధిని పెంచితే పాంక్రియాటిక్ క్యాన్సర్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చని పరిశోధకులు తాజాగా గుర్తించారు. త్వరలోనే ఔషధాలను తీసుకురానున్నట్టు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

