న్యూఢిల్లీ: స్పానిష్ క్యాన్సర్ పరిశోధన కేంద్రానికి చెందిన ఒక శాస్త్రవేత్తల బృందం క్లోమ క్యాన్సర్‌ను నయం చేయడంలో పెద్ద ముందడుగు వేసింది. శక్తిమంతమైన కొత్త ఔషధాల కాంబినేషన్ల ద్వారా ఎలుకల్లో పాంక్రియాట్రిక్(క్లోమ) కణితులను పూర్తిగా తొలగించడంలో సఫలమైంది.
డరాక్సన్స్రిబ్, ఎస్డి36, మరో ఔషధాన్ని కలిపి ఎలుకలకు ఇస్తే వాటిలోని క్లోమ కణితులు పూర్తిగా అంతమై మళ్లీ పెరగలేదు. ప్రయోగశాల్లో పెంచిన మానవ రోగుల కణితులపైనా ఈ ఔషధాలను పరీక్షించారు.