పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు పనులను కొనసాగించుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొన్నది.
రాష్ట్రంలో ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా పాలమూరు ఐటీ టవర్‌ను ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ప్రారంభించనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రజలకు తీపి కబురు చెప్పారు.