జిల్లాలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయానికి తెరలేపాయి. బయటకు రోజంతా ఒకదానిపై మరికొకటి దుమ్మెత్తి పోసుకునే ఆ రెండు పార్టీలు పదవుల దగ్గరికి వచ్చేసరికి ములాఖత్ అయ్యాయి.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిబట్ల మున్సి పాలిటీ కాంగ్రెస్‌లో ముసలం రాజుకున్నది. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై సొంత పార్టీకి చెందిన కౌన్సి లర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం కలకలం రేపుతున్నది.