రంగారెడ్డి, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆదిబట్ల మున్సి పాలిటీ కాంగ్రెస్‌లో ముసలం రాజుకున్నది. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై సొంత పార్టీకి చెందిన కౌన్సి లర్లే అవిశ్వాస తీర్మానం పెట్టడం కలకలం రేపుతున్నది. అవిశ్వాసం కోసం పావులు కదుపుతున్న మర్రి నిరంజన్‌రెడ్డి ఇప్పటికే సొంత పార్టీతోపాటు ఇతర పార్టీలకు చెందిన కౌన్సిలర్లతో క్యాంపులో ఉన్నారు. ఆయన వ్యవహారంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ అధిష్ఠానం పార్టీ ధిక్కారం కింద అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కోమటిరెడ్డికి నిరంజన్‌రెడ్డి ముఖ్య అనుచరుడు కావడం.. అవి శ్వాసంపై స్థానిక ఎమ్మెల్యే సైతం అసంతృప్తిగా ఉండడంతో ఈనెల 9న జరుగనున్న సమా వేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
ఆదిబట్ల కాంగ్రెస్‌లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతున్నది. మర్రి నిరంజన్‌రెడ్డి నేతృత్వంలో 13 మంది కౌన్సిలర్లు చైర్పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ప్రస్తుతం చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న కొత్త ఆర్తిక కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్‌గా విజయం సాధించి బీఆర్ఎస్లో చేరి చైర్పర్సన్ అయ్యారు. ఈ పరిణామంతో అప్పట్లో చైర్మన్ పదవి రేసులో ఉన్న నిరంజన్‌రెడ్డికి ఆశాభంగం కలిగింది. చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఆమె తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
పాలకవర్గం పదవీబాధ్యతలు చేపట్టి నాలుగేండ్లు ముగియడంతో తొమ్మిదో వార్డు కౌన్సిలర్ మర్రి నిరంజన్‌రెడ్డి అవిశ్వాస తీర్మానానికి పావులు కదిపారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లతో కలిసి కలెక్టర్‌కు అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు కలెక్టర్ శశాంక ఈనెల 9న అవిశ్వాస తీర్మానంపై సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించి కౌన్సిలర్లకు నోటీ సులు జారీ చేశారు. ఈ సందర్భంలోనే కాంగ్రెస్ అధిష్ఠానం నిరంజన్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసి షాక్ ఇచ్చింది.
అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించిన కౌన్సిలర్లు అంతా కొంతకాలంగా విహార యాత్ర పేరిట క్యాం పులోనే ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అవిశ్వాసం వద్దనే భావనలో కాంగ్రెస్ పెద్ద లు ఉన్నట్లు తెలిసింది. అయితే అధిష్ఠానం ఆదేశాలు లెక్క చేయకుండా మర్రి నిరంజన్‌రెడ్డి అవి శ్వాసం దిశగా అడుగులు వేయడం పార్టీ పెద్దలను ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి నోటీసును జారీ చేశారు.
అయినా నిరంజన్‌రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో కాంగ్రెస్ అధిష్ఠానం రెండు రోజుల క్రితమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అతడు ప్రస్తుతం పీసీసీ సభ్యుడిగా ఉన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెం కట్రెడ్డికి ముఖ్యఅనుచరుడు. అవిశ్వాసంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం ఆగ్రహంగా ఉన్న ట్లు తెలిసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈనెల 9న జరుగనున్న అవిశ్వాస తీర్మాన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.