మిగ్జాం తుఫాన్ భయపెడుతున్నది. నాలుగు రోజులుగా ఒకటే ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతుండడంతో చలి పులి మరింత భయపెడుతున్నది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మిగ్జాం తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది.