మహబూబ్నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఎదిరలో సోమవారం బంగారు మైసమ్మ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా బయలుదేరారు.
మండల కేంద్రంలో మంగళవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో పురుషులు అంబలితో బోనాలు తీసుకొని పోచమ్మ తల్లికి పోసి గొర్రెలకు ఎలాంటి రోగాలు రాకుండా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల మహోత్సవం ఆదివారం ప్రారంభమైంది.ఆషాడ మాసం మొదటి వారంలో సిద్దిపేట బురుజు మైసమ్మకు భక్తులు బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది.