పాలమూరు, జూలై 29 : మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ నాలుగో వార్డు ఎదిరలో సోమవారం బంగారు మైసమ్మ బోనాల ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన బోనాలతో మహిళలు ఊరేగింపుగా బయలుదేరారు. శివసత్తులు, యువకు లు, డోలు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ ఉత్సాహం నింపారు. ఈ ఉత్సవాలలో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, పుర చైర్మన్ ఆనంద్‌గౌడ్ బోనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివసత్తులతో కలిసి డోలు వాయించారు.
ఈ సందర్భంగా వార్డు పెద్దలు పెద్ద ఎత్తున శ్రీనివాస్‌గౌడ్‌కు స్వాగతం పలికారు. యువకులు పెద్దఎత్తున ఈయనతో సెల్ఫీ లు తీసుకొని తమ అభిమానం చాటుకున్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ యాదమ్మాహనుమంతు, మాజీ కౌన్సిలర్ శివశంకర్, మాజీ స ర్పంచ్‌లు జంగన్న, వెంకటయ్యగౌడ్, సూద నర్సింహులు, ఎల్లయ్య, రాములు, శేఖర్, శ్రీనివాసులు, ఆంజనేయులు, శేఖర్, కృష్ణ, హకీం, సత్యం, నర్సింహులు, వార్డు యువకులు, మహిళలు పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని లాల్ దర్వాజలోని సింహవాహిణి మహాంకాళి అమ్మవారిని సోమవారం మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కుటుంబసమేతంగా దర్శించుకొని పూజలు చేశారు. అలాగే ఉప్పుగూడలోని బోనా ల ఉత్సవాల్లో పాల్గొన్నారు.