భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలు
మండల కేంద్రంలో మంగళవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో పురుషులు అంబలితో బోనాలు తీసుకొని పోచమ్మ తల్లికి పోసి గొర్రెలకు ఎలాంటి రోగాలు రాకుండా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.
మరికల్, జూలై 9 : మండల కేంద్రంలో మంగళవారం కురుమ సంఘం ఆధ్వర్యంలో పురుషులు అంబలితో బోనాలు తీసుకొని పోచమ్మ తల్లికి పోసి గొర్రెలకు ఎలాంటి రోగాలు రాకుండా చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. అదేవిధంగా సాయం త్రం మహిళలతో బోనాలతో ఊరేగింపుగా బయలుదేరి ప్రత్యేక పూజలు, నేవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా పోతురాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కురుమసంఘం నాయకులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
ఘనంగా బోనాలు..
ధన్వాడ, జూలై 9 : ధన్వాడ మండలంలోని కంసాన్పల్లి, హన్మాన్‌పల్లి, ధన్వాడ గ్రామాల్లో మంగళవారం పోలమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో పెద్ద ఎత్తున ఊ రేగింపు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమాల్లో ఆయాగ్రామాల పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
వైభవంగా బోనాలు
మాగనూర్, జూలై 9 : సకాలంలో వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండాలని గ్రామస్తులు మైసమ్మతల్లిని వేడుకున్నారు. మంగళవారం మాగనూర్‌లో మైసమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శ్యామలమ్మ, మాజీ సర్పంచ్ రాజు, మాజీఉపసర్పంచ్ సుధా తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో బోనాలు
హన్వాడ, జూలై 9 : మండలంలోని కొత్తపేటలో మంగళవారం పోచమ్మ ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు అందంగా అలంకరించిన బోనాలతో డప్పు చప్పుళ్లు, పోతరాజుల విన్యాసాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అరుణ్, మాజీ సర్పంచ్ చెన్నమ్మ, నాయకులు డబ్బ రాములు, శ్రీనివాసులు, వెంకటయ్య, చెన్నయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavita Kumari: కాళ్లకు షూ లేకుండా చీరలో రన్నింగ్ .. ఆ కవిత కల నెరవేరలేదు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

