ఒకసారి నారదుడికి తన కంటే గొప్పభక్తులు లేరని గర్వం పొడచూపిందట. అతడి మనసు తెలుసుకున్న మహావిష్ణువు ‘నారదా! భూలోకంలో నా పరమభక్తుడు ఒకరు ఉన్నాడు. అతణ్ని కలిసి రా! భక్తి అంటే ఏంటో తెలుస్తుంది’ అని చెప్పాడు.
కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు శివారులో ఏకశిల కొండపై స్వయంభూవుగా వెలసిన మత్స్యగిరీంద్రుడి ఆలయం మహిమాన్విత క్షేత్రంగా భాసిల్లుతున్నది. ఇక్కడ బంగారు చేప రూపంలో మహావిష్ణువు భక్తులకు దర్శనమ