కంచర్ల ఉపేంద్ర, అపర్ణాదేవి జంటగా రూపొందిస్తున్న చిత్రం ‘1920 భీమునిపట్నం’. నరసింహ నంది దర్శకుడు. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం హైదరాబాద్లో జరిగింది.
‘నన్ను హీరోగా పెట్టి మా నాన్న ఒకేసారి అయిదు సినిమాలు నిర్మిస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను’ అని వర్ధమాన కథనాయకుడు కంచర్ల ఉపేంద్ర అన్నాడు.
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఆర్యన్ సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కంచర్ల అచ్యుతరావు నిర్మించారు.