‘నన్ను హీరోగా పెట్టి మా నాన్న ఒకేసారి అయిదు సినిమాలు నిర్మిస్తుండటం నా అదృష్టం. తప్పకుండా నా ప్రతిభను నిరూపించుకుంటాను’ అని వర్ధమాన కథనాయకుడు కంచర్ల ఉపేంద్ర అన్నాడు. ఆయన హీరోగా సావిత్రికృష్ణ హీరోయిన్గా ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. కంచర్ల అచ్యుతరావు నిర్మాత. డిసెంబర్ 1న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా కంచర్ల ఉపేంద్ర విలేకరులతో ముచ్చటించాడు. ‘ ఇప్పటికే రెండు సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. ఇక ‘ఉపేంద్రగాడి అడ్డా’ విషయానికొస్తే, ఇదొక యువతరం మెచ్చే మాస్ ఎంటర్టైనర్. సందేశం కూడా ఉంటుంది. పెరుగుతున్న సాంకేతికత, ఆండ్రాయిడ్ ఫోన్ల వాడకం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇందులో చూపించాం’ అని కంచర్ల ఉపేంద్ర అన్నారు. కొత్తవాళ్లను ప్రోత్సహించాలనే నిర్మాణసంస్థను స్థాపించామని, ‘1920 భీమునిపట్నం’ సినిమా చిత్రీకరణ దశలో ఉందని, ‘ఉపేంద్రగాడి అడ్డా’ సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందని కంచర్ల ఉపేంద్ర చెప్పారు.