ద్వీపరాజ్యానికి బయల్దేరిన జాయప.. అనుకోని పరిస్థితుల్లో మళ్లీ వెనక్కి వచ్చాడు. కొత్తగా నిర్మితమవుతున్న ఓరుగల్లు పట్టణంలో మిత్రులతో కలిసి తిరుగాడుతున్నాడు. అప్పుడే వచ్చిన ‘సంక్రాంతి’ సంబురాల్లో పాలుపం�
జాయప విషయంలో చౌండ పరిస్థితి చిత్రమైనది. తన ఇంటికి వచ్చిన జాయపను పొమ్మనలేడు. ఉంచుకోనూ లేడు. కానీ, అతనికి ఏదైనా అపాయం జరిగితే.. అది పెద్ద విషయమై చౌండ తలకు చుట్టుకుంటుంది.
ఆ ద్వీపసీమకు తన బంధువైన భూమయ నాయకుడిని పంపి, అభివృద్ధి చెయ్యవలసిందిగా కోరాడు రెండవ రాజేంద్రచోడుడు. రాజాజ్ఞ, ఆర్థిక సహకారంతో భూమయ ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్నాడు.