మూడు రోజులపాటు జరిగిన జాన్పహాడ్ దర్గా ఉర్సు శనివారం దీపారాధనతో ముగిసింది. తొలిరోజు లక్షకు పైగా వచ్చిన భక్తులు మూడో రోజూ వేల సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. సైదులు బాబా సమాధుల వద్ద చాదర్లు సమర్పించారు.
మత సామరస్యానికి, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్న జాన్పహాడ్ దర్గా ఉర్సు జన జాతరను తలపిస్తున్నది. ఉత్సవాల్లో రెండో రోజు శుక్రవారం గంధోత్సవం (ఉర్సే షరీఫ్) ఘనంగా, సాంప్రదాయ బద్ధంగా జరిగింది.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 25, 26, 27 తేదీల్లో జరిగే సైదులు బాబా ఉత్సవాలకు దర్గా నిర్వాహకులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మండలంలోని జాన్పహాడ్ దర్గాకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈ నెల 25నుంచి దర్గా ఉర్సు ప్రారంభం కానుండగా.. ఇప్పటి నుంచే సైదులు బాబా సమాధుల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని దర్గా ముజావర్ జానీ త
ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే జాన్పహాడ్ దర్గా ఉర్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. గురువారం మండలంలోని జాన్పహాడ్ దర్గాలో ఉత్సవాలకు ఏర్పాట్లను ట్రైనీ ఎస్పీ రాజే�