పాలకవీడు, జనవరి 19 : మండలంలోని జాన్పహాడ్ దర్గాకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. ఈ నెల 25నుంచి దర్గా ఉర్సు ప్రారంభం కానుండగా.. ఇప్పటి నుంచే సైదులు బాబా సమాధుల దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని దర్గా ముజావర్ జానీ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో దర్గా పరిసరాలు కిక్కిరిశాయి.