నటుడు సుహాస్ ‘జనక అయితే గనుక’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నది. ఈ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకొని కొత్త తరహా కథతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట సుహాస్. ఆయన దగ్గరకు ఓ సోషియో ఫాంటసీ కథ వచ్చిందట
సుహాస్, సంగీర్తన జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. దిల్రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షితరెడ్డి, హన్షితరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.
బలగం, లవ్వీ వంటి వినూత్న కథా చిత్రాల తర్వాత దిల్రాజు ప్రొడక్షన్స్ సంస్థ నుంచి వస్తోన్న మరో చిత్రం ‘జనక అయితే గనక’. సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సందీప్ బండ్ల దర్శకత్వం వహిస్తున్నారు.