సుహాస్, సంగీర్తన జంటగా దిల్‌రాజు ప్రొడక్షన్స్‌లో రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకుడు. హర్షిత్‌రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలు. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ చూసిన సుహాస్, యూఎస్ఏ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ ‘ఫైనల్ వెర్షన్ చూశాక, ఆలస్యం చేయకుండా యుఎస్ఏ హక్కులు తీసుకున్నా.
ఇది పక్క ఎంటైర్టెనర్. ప్రతిదానికీ లెక్కలు చెప్పే మిడిల్‌క్లాస్ కుర్రాడిగా ఇందులో కనిపిస్తా. ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించే సినిమా ఇది.’ అని చెప్పారు. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: విజయ్ బుల్గానిన్.