సుహాస్, సంగీర్తన జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటైర్టెనర్ ‘జనక అయితే గనక’. సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షితరెడ్డి, హన్షితరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. శిరీష్ సమర్పకుడు. దసరా కానుకగా అక్టోబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్ వేగవంతం చేశారు. ఇప్పటికే పోస్టర్లు, పాటలు, టీజర్ విడుదల చేశారు. తాజాగా ‘ఏం పాపం చేశామో..’ అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ పాటను విజయ్ బుల్గానియా స్వరపరచగా, రితేజ్ జి. రావు ఆలపించారు. మిడిల్‌క్లాస్ ఉద్యోగి మేనేజర్‌తో పడే తంటాలు, చాలీచాలని జీతాలవల్ల ఎదురయ్యే కష్టాలు.. ఇవన్నీ ఈ పాటలో ఫన్నీగా చూపించారు. అందరికీ నచ్చే సినిమాగా ‘జనక అయితే గనక’ నిలుస్తుందని మేకర్స్ నమ్మకం వెలిబుచ్చారు.