Suhas | నటుడు సుహాస్ ‘జనక అయితే గనుక’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నది. ఈ సినిమా తర్వాత కాస్త విరామం తీసుకొని కొత్త తరహా కథతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట సుహాస్. ఆయన దగ్గరకు ఓ సోషియో ఫాంటసీ కథ వచ్చిందట. అది బాగా నచ్చిందట. అయితే.. దాని బడ్జెట్ సుహాస్ మార్కెట్కు మించి ఉండటంతో ఎలాగొలా ఆ సినిమాను పట్టాలెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నాడట సుహాస్.
గతంలో వచ్చిన సోషియో ఫాంటసీ కథలకు పూర్తి భిన్నంగా ఈ కథ ఉంటుందనీ, తనకు ఈ కథ సరిగ్గా సరిపోతుందని సుహాస్ భావిస్తున్నాడట. అందుకే నిర్మాణంలో భాగం కావడానికి కూడా రెడీ అవుతున్నారట. ఆ కథపై సుహాస్కున్న నమ్మకం అలాంటిది. త్వరలోనే దర్శకుడి పేరు రివీల్ కానుంది. మిగతా వివరాలు తెలియాల్సివుంది.