మూడు రోజులపాటు జరిగిన జాన్పహాడ్ దర్గా ఉర్సు శనివారం దీపారాధనతో ముగిసింది. తొలిరోజు లక్షకు పైగా వచ్చిన భక్తులు మూడో రోజూ వేల సంఖ్యలో వచ్చి పూజలు చేశారు. సైదులు బాబా సమాధుల వద్ద చాదర్లు సమర్పించారు.
పాలకవీడు మండలం జాన్పహాడ్ గ్రామంలోని సైదులు బాబా దర్గా ఉర్సుకు సిద్ధమైనది. ఈ నెల 26, 27, 28 తేదీల్లో మూడు రోజులపాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.