రాష్ట్రంలోని ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వారంతా 1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందినవారే.
ఇండియన్ పోలీస్ సర్వీస్ (రిక్రూట్మెంట్) రూల్స్ 1954 ప్రకారం తెలంగాణకు ముగ్గురు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.