తెలంగాణలో ముగ్గురికి ఐపీఎస్ హోదా
ఇండియన్ పోలీస్ సర్వీస్ (రిక్రూట్మెంట్) రూల్స్ 1954 ప్రకారం తెలంగాణకు ముగ్గురు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఇండియన్ పోలీస్ సర్వీస్ (రిక్రూట్మెంట్) రూల్స్ 1954 ప్రకారం తెలంగాణకు ముగ్గురు పోలీసు అధికారులకు ఐపీఎస్ హోదా కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ రూల్స్ (ప్రమోషన్ టు పోస్టింగ్) ద్వారా సీఐడీ ఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ వెంకటేశ్వర్లు, మహేశ్వరం డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, వరంగల్ డీసీపీ (క్రైమ్స్) డీ మురళీధర్‌ను ఐపీఎస్‌లుగా గుర్తిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కొత్తగా ఐపీఎస్ హోదా పొందిన ఈ ముగ్గురిని తెలంగాణకు కేటాయించారు. ఇండియన్ పోలీస్ సర్వీస్ ప్రొబేషన్ రూల్స్ ప్రకారం ఈ ముగ్గురు అధికారులు ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. అనంతరం ఇండక్షన్ ట్రైనింగ్ పొందిన తర్వాత పూర్తిస్థాయిలో విధులు నిర్వర్తిస్తారు. మహేశ్వరం డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న చింతమనేని శ్రీనివాస్ ఎస్సై నుంచి ఐపీఎస్ హోదా పొందారు. ఎస్సై నుంచి ఐపీఎస్ హోదా పొందిన అతి కొద్దిమందిలో శ్రీనివాస్ ఒకరు.
8 మంది ఏఎస్పీలకు పోస్టింగ్
రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది అడిషనల్ ఎస్పీ(నాన్‌కేడర్)లకు పోస్టింగ్, ఒకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన తెలిపారు. వెయిటింగ్లో ఉన్న ఏఎస్పీలకు పోస్టింగ్ ఇవ్వగా, హైదరాబాద్ సిటీ సీఎస్‌డబ్ల్యూ అడిషనల్ డీసీపీగా ఉన్న ఎం కృష్ణారెడ్డిని సీటీసీకి బదిలీ చేశారు.
67 మంది డీఎస్పీలకు బదిలీలు
రాష్ట్రవ్యాప్తంగా 67 మంది డీఎస్పీ(సివిల్)ల్లో కొందరిని బదిలీ చేస్తూ, వెయింటింగ్‌లో ఉన్న మరికొందరికి పోస్టింగ్ ఇస్తూ డీజీపీ అంజనీకుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలిపారు. తాజా ఉత్తర్వులతో వెయిటింగ్లో ఉన్న 56 మంది డీఎస్పీలకు పోస్టింగ్ లభించింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

