న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంలో ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజీ), తత్సమాన స్థాయి పోస్టుల్లో నియామకాలకు ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారుల ఎంపానెల్మెంట్ కోసం మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ సవరించింది.
కొత్త ఆర్డర్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వం లో ఐజీ లెవెల్ పోస్ట్‌లకు ఎంపానెల్మెంట్ కోసం ఎస్పీ/డీఐజీ లేదా తత్సమాన స్థాయిలో కనీసం రెండేండ్ల పాటు సెంట్రల్ డిప్యుటేషన్ తప్పనిసరి. ఐపీఎస్ 2011 బ్యాచ్ నుంచి ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. తమ కేడర్స్లో డీఐజీ లేదా తత్సమాన స్థాయిలో పని చేస్తున్న అధికారులకు వర్తిస్తాయి.