కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో చెట్ల కూల్చివేతను తక్షణం నిలిపివేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఎట్టి పరిస్థితుల్లో పనులు కొనసాగకూడదని స్పష్టం చేసింది. �
కంచ గచ్చిబౌలిలోని భూముల్లో పనులు నిలిపివేత ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 7వ తేదీ వరకు పొడిగించింది. అప్పటివరకు సదరు భూముల్లోని చెట్ల నరికివేత కొనసాగించరాదని గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.
హెచ్సీయూకు చెందిన 400 ఎకరాల విలువైన భూమిని కబ్జా చేసి, దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి అప్పగించేందుకు కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు.