ఎగువ ప్రాంతాల నుంచి వరద లేకపోవడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పడుతున్నది. మంగళవారం రాత్రి 11 గంటలకు 49.50 అడుగుల వద్ద గోదావరి ప్రవాహం ఉండగా.. బుధవారం ఉదయం 7 గంటలకు 50.30 అడుగులకు చేరింది.
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నదీ ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. మంగళవారం ఉదయం 8 గంటలకు నదీ ప్రవాహం 51.60 అడుగుల స్థాయికి చేరుకున్నది.
రాష్ట్రంతోపాటు ఎగువన భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి (Godavari river) వరద పోటెత్తింది. దీంతో భద్రాచలం (Bhadrachalam) వద్ద ఉగ్రగోదారి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తున్నది.