Bhadrachalam | గోదావరి మహోగ్రరూపం.. భద్రాచలం నుంచి నిలిచిన రాకపోకలు
భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నదీ ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. మంగళవారం ఉదయం 8 గంటలకు నదీ ప్రవాహం 51.60 అడుగుల స్థాయికి చేరుకున్నది.
భద్రాచలం: భద్రాచలం (Bhadrachalam) వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తుండటంతో నదీ ప్రవాహం క్రమేపీ పెరుగుతున్నది. మంగళవారం ఉదయం 8 గంటలకు నదీ ప్రవాహం 51.60 అడుగుల స్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 53 అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీచేయనున్నారు.
రామయ్య పాదల చెంత నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వరద నీరు కరకట్ట పనుల వద్దకు చేరింది. భద్రాచలం పట్టణంలోని కొత్త కాలనీలోకి క్రమంగా వరద నీరు చేరుతున్నది. భద్రాచలం-కూనవరం రోడ్డుపైకి వరదనీరు చేరింది. దీంతో భద్రాచలం నుంచి విలీన మండలాలకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం శివారులో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ వెళ్లే వాహనాలు వందల సంఖ్యలో ఆగిపోయాయి. ఇక దుమ్ముగూడెం మండలం తూరుబాక వద్ద రోడ్డుపై నీరు ప్రవహిస్తుండటంతో దుమ్ముగూడెం, చర్ల వెళ్లే రహదారుల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముందుజాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు.
మరో మూడు రోజుల పాటు వర్షాలు..
మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. వరదలు, వర్షాల ప్రభావంపై సోమవారం డీజీపీ జితేందర్, ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్సుల్తానియాతో కలిసి ఆమె కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై సీఎం నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. పునరావాస కేంద్రాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.
అన్ని జిల్లాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ, వర్షాల నేపథ్యంలో పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో వర్ష, వరదల తీవ్రత దృష్ట్యా పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, తగు చర్యలు తీసుకుంటున్నామని భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల కలెక్టర్లు తెలిపారు.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
నిజామాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి తదితర జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేశారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. సోమవారం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్ఛరికను జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

