Godavari water level | ఉగ్ర గోదారి..భద్రాచలం దగ్గర 71 అడుగులకు చేరిన నీరు
కుండపోత వర్షాలు, భారీ వరదలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 71 అడుగులకు చేరిపోయింది. గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది.
కుండపోత వర్షాలు, భారీ వరదలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. నదీ ప్రవాహం 71 అడుగులకు చేరిపోయింది. గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతున్నది.
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరద కారణంగా క్షణక్షణానికి గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. ఇలా ఉప్పొంగి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తుంది.#Bhadrachalam #Godavari #Waterfloods pic.twitter.com/Zl8IjC5PtZ
— Namasthe Telangana (@ntdailyonline) July 15, 2022
భద్రాచలం పరిసరాల్లో ఎటు చూసినా వరద ప్రవాహామే కనిపిస్తోంది. భద్రాచలం రామాలయంతో పాటు సమీప కాలనీలు నీట మునిగాయి. ప్రమాదకర స్థాయిలో వరద వస్తున్నది. ఇంతటి వరదను ఎప్పుడూ చూడలేదని ఇక్కడ ప్రజలు అంటున్నారు.

కాగా, వరద పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా అధికారులు భ్రదాచలం వంతెనను మూసివేశారు. బ్రిడ్జిపై నుంచి ఎలాంటి వాహనాలను రాకపోకలకు అనుమతించడం లేదు. 1986లో నీటిమట్టం 75.6 అడుగులకు చేరిన సమయంలో మొదటిసారిగా వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. మళ్లీ 36 సంవత్సరాల భారీగా వరద వస్తుండడంతో ఆంక్షలు విధించారు.
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం 70 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భద్రాచలం రామాలయం పరిసరాలు నీట మునిగాయి.. #Bhadrachalam #Godavari #Waterfloods pic.twitter.com/z8tM00h7pC
— Namasthe Telangana (@ntdailyonline) July 15, 2022
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

