హృదయాల్ని స్పృశించే అందమైన భావోద్వేగాలతో ‘గోదారి గట్టుపైన’ చిత్రాన్ని తెరకెక్కించామని, ఈ వేసవిలో అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా ఇదని అన్నారు చిత్ర కథానాయకుడు సుమంత్ ప్రభాస్.
సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న గ్రామీణ ప్రేమకథ ‘గోదారి గట్టుపైన’ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్నారు నాగవంశీ. సుభాష్‌చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 8న విడుదలకానుంది.