సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రూరల్, లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’. నిధి ప్రదీప్ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుభాష్‌చంద్ర దర్శకుడు. అభినవ్ రావు నిర్మాత. మే 8న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.
ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 27న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని శనివారం ఓ ప్రకటన ద్వారా మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ రొమాంటిక్ వైబ్‌లో కనిపిస్తున్నారు. రాజీవ్ కనకాల, లైలా, దేవిప్రసాద్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్, సంగీతం: నాగవంశీకృష్ణ, నిర్మాణం: రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్.