తెలుగు వారికి సంక్రాంతి మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి సందడి భోగి నుంచే మొదలవుతుంది. ఈ రోజున సూర్యోదయ సమయంలో ఇంటిముందు కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.