కాంగ్రెస్ ప్రభుత్వ అసంబద్ధ, అసమర్థ విధానాలతో ఆర్థికంగా రాష్ట్రం పతనం అవుతున్నది. తెలంగాణ ఏర్పడినది మొదలు ఏటేటా మెరుగైన ఆదాయం సాధించి కళకళలాడిన ఖజానా.. రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చాక కళతప్పడం మొదలైంది.
జీహెచ్ఎంసీలో అకాశహర్మ్యాల కళ తప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో 130 హైరైజ్డ్ బిల్డింగ్లకు అనుమతులు లభించగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 102 చోట్ల మాత్రమే అనుమతులు జారీ చేశారు.
ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యా న్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది. ఇందులో �