Real Estate | సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో అకాశహర్మ్యాల కళ తప్పింది. గత ఆర్థిక సంవత్సరంలో 130 హైరైజ్డ్ బిల్డింగ్‌లకు అనుమతులు లభించగా.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 102 చోట్ల మాత్రమే అనుమతులు జారీ చేశారు. ఎక్కువగా పశ్చిమాన మాత్రమే ఈ కళ సంతరించుకోవడం విశేషం. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలుకావడంతో 2024-25 ఆర్థిక సంవత్సరం గణంకాలను టౌన్‌ప్లానింగ్ విభాగం బుధవారం వెల్లడించింది.
గతంలో కంటే ఈ సారి రెసిడెన్షియల్ తప్ప హైరైజ్డ్ బిల్డింగ్లు ఎక్కువగా లేకపోవడం, ప్రభుత్వంపై నమ్మకం సన్నగిల్లి పెట్టుబడులు భారీ కంపెనీలు ముందుకు రాకపోడమే ఇందుకు నిదర్శమని నిర్మాణ రంగ నిపుణులు తెలిపారు. కొండాపూర్‌లో 50 అంతస్తుల భవనానికి అనుమతి మంజూరు కాగా, మరో ఐదు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని అధికారులు తెలిపారు.