ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, పెరిగిన బ్రెంట్ ముడి చమురు ధరలు.. దేశీయ స్టాక్ మార్కెట్లను శుక్రవారం భారీ నష్టాల్లోకి నెట్టాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు కదంతొక్కాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు దేశీయంగా యుటిలిటీ, పవర్ రంగ షేర్లు భారీగా పుంజుకోవడంతో సూచీలు ఒక్క శాతానికి పైగా లాభపడ్డాయి.